వాలంటీర్లకు మరో ఎదురు దెబ్బ..ఆ ఆప్షన్ తొలగింపు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లకు మరో ఎదురు దెబ్బ తగిలింది. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే పదివేల రూపాయల జీతం పెంచాలని… ఏపీలో వాలంటీర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 నెలలుగా… ఏపీలో వాలంటీర్లు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఆందోళన చేస్తున్న వాలంటీర్లకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

గ్రామ అవార్డు సచివాలయ శాఖకు సంబంధించిన మొబైల్ యాప్ లో వాలంటీర్లు హాజరు వేసుకునేటువంటి ఆప్షన్ను… తాజాగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఇకపై వాళ్లు హాజరు వేసుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. వారం కిందటి వరకు ఈ సదుపాయం ఉండగా…. మంత్రి వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థలో తాము లేమని ప్రకటించడంతో మొబైల్ యాప్ లో హాజరు వేసుకునే ఆప్షన్ ను తొలగించారట. దీంతో ఏపీ వాలంటీర్లు రోడ్డున పడినట్లు అయింది. ఇక వీరందరూ ఏపీ కూటమి ప్రభుత్వంపై…. ఉద్యమం చేసేందుకు రెడీ అవుతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version