ధనుష్-ఐశ్వర్యకు విడాకులు మంజూరు

-

సినిమా ఇండస్ట్రీ లో మరో జంట విడిపోయింది. తమిళ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ ఇద్దరూ విడిపోయారు. గతంలోనే ఐశ్వర్య అలాగే ధనుష్ విడిపోతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. కానీ తాజాగా కోర్టు ధనుష్ అలాగే ఐశ్వర్య జంటకు అధికారికంగా విడాకులు ఇవ్వడం జరిగింది.

 

చెన్నై ఫ్యామిలీ కోర్టు… ధనుష్ అలాగే ఐశ్వర్య జంటకు విడాకు ఇచ్చింది. ఈ మేరకు కీలక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలోనే ధనుష్ అలాగే ఐశ్వర్య రజినీకాంత్ ఇద్దరు కలిసి విడాకులకు అప్లై చేసుకున్నారు. ఐశ్వర్య అలాగే హీరో ధనుష్ మొత్తం చిన్నచిన్న మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

 

 

అయితే ఈ నేపథ్యంలోనే గత వారంలో వీరిద్దరి కేసును చెన్నై ఫ్యామిలీ కోర్టు విచారణ చేసింది. మేము ఇద్దరం కలిసి ఉండేందుకు ఇష్టంగా లేమని గతవారం చెన్నై ఫ్యామిలీ కోర్టు ముందు ఐశ్వర్య, ధనుష్ చెప్పడం జరిగింది. ఈ తరుణంలోనే తమిళ హీరో ధనుష్, అలాగే ఐశ్వర్య కు విడాకులు ఇస్తున్నట్లు చెన్నై ఫ్యామిలీ కోర్టు ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version