రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో ఫింగర్ ప్రింట్ ఫోర్జరీ ముఠా అరెస్ట్

-

రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో ఫింగర్ ప్రింట్ ఫోర్జరీ ముఠాని అరెస్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ.. గత నెల 29 న ఫింగర్ ప్రింట్ సర్జరీ కేసులో కువైట్ కు వెళ్లిన మరో 4 గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. రాజస్థాన్, కేరళ లో ఈ ఫేక్ ఫింగర్ ప్రింట్ ముఠా ఆపరేషన్ చేసుకొని కువైట్ వెళ్ళిందన్నారు. రాజస్థాన్ లో సర్జరీ చేసుకున్న కమలేష్ ,విశాల్ కుమార్ ను అరెస్ట్ చేశామన్నారు మహేష్ భగవత్. మరో ఇద్దరిని కేరళలో అరెస్ట్ చేశామన్నారు.

అబ్దుల్ ఖదీర్ ,మొహమ్మద్ రఫీ ని పట్టుకున్నామని తెలిపారు. మరో ఇద్దరు పరారీ లో ఉన్నారని అన్నారు. మనిషి పుట్టినప్పటి నుంచి చని పోయావరకు ఫింగర్ ప్రింట్ చేంజ్ కాదని.. కానీ ఈ ముఠా ఆపరేషన్ తో ఫింగర్ ప్రింట్ చేంజ్ చేస్తుందన్నారు. ఫింగర్ దగ్గర కట్ చేస్తున్నారు దెంతో అంతకు ముందు ఉన్న ఫింగర్ ప్రింట్ మ్యాచ్ కాకుండా చేస్తున్నారని అన్నారు. మొత్తం ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశామన్నారు సీపి. నిందితుల నుంచి 4 ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version