కామన్వెల్త్​లో భారత్​కు మరో పసిడి పతకం

-

కామన్వెల్త్ క్రీడల్లో భారత్​ను మరో పసిడి వరించింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్​లో సుధీర్ స్వర్ణం సాధించాడు. ఆసియా పారా ఒలింపిక్స్​లో కాంస్య విజేత అయిన సుధీర్ తాజాగా ఈ పతకాన్ని సాధించాడు.

కామన్వెల్త్‌ క్రీడల బాక్సింగ్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల్లో స్టార్‌ బాక్సర్‌ అమిత్‌ ఫంగాల్‌ (48-51 కేజీలు), సాగర్‌ (92 కేజీల పైన), మహిళల్లో జాస్మిన్‌ (57-60 కేజీలు) సెమీఫైనల్‌ చేరారు. క్వార్టర్స్‌లో అమిత్‌ 5-0తో లెనోన్‌ (స్కాట్లాండ్‌)ను చిత్తు చేయగా.. సాగర్‌ అంతే తేడాతో కెడీ ఇవాన్స్‌ (సెచిలెస్‌)ను ఓడించాడు. గత క్రీడల్లో రజతం గెలిచిన ఫంగాల్‌ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.

ఒకవైపు పదునైన పంచ్‌లతో లెనోన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన అతడు.. పటిష్టమైన డిఫెన్స్‌, చక్కని ఫుట్‌వర్క్‌తో ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. ఇవాన్స్‌తో పోరులో సాగర్‌ కూడా అమిత్‌ మాదిరే దూకుడుగా ఆడాడు. లెఫ్ట్‌ హుక్స్‌తో పాయింట్లు కొల్లగొట్టిన అతడు సులభంగా బౌట్‌ గెలిచాడు.

మహిళల విభాగంలో జాస్మిన్‌ 4-1తో టోరీ గార్టన్‌ (న్యూజిలాండ్‌)ను ఓడించింది. ఈ బౌట్లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా నిలిచిన జాస్మిన్‌ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ఆటలో పతకాలు ఖాయం చేసిన బాక్సర్ల సంఖ్య ఆరుకు చేరింది. వీరి కంటే ముందు నిఖత్‌ జరీన్‌, హుసాముద్దీన్‌, నీతు సెమీస్‌ చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version