గిరిజన సలహా మండలికి చైర్ పర్సన్ గా పుష్ప శ్రీవాణిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గిరిజన సలహా మండలిలో చైర్మన్ తో పాటు మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణికి వైఎస్ జగన్ మరో కీలక పదవిని అప్పగించారు. ఏపీ ప్రభుత్వం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఏపీ ప్రభుత్వం జారీ చేసింది.
అయితే.. గిరిజన సలహా మండలికి చైర్ పర్సన్ గా పుష్ప శ్రీవాణిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గిరిజన సలహా మండలిలో చైర్మన్ తో పాటు మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు.
గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి, మరో ఇద్దరు అధికారులు ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. దీనికి రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిషనర్ సెక్రటరీగా ఉంటారు.
ఈ మండలిని మూడేళ్ల పాటు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అనధికార సభ్యులుగా… పాలకొండ ఎమ్మెల్యే కళావతి, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజులు ఉంటారు.