కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ మరో లేఖ రాసింది. వెలిగొండ ప్రాజెక్టు కు ఏఐబీపీ ద్వారా నిధులు కేటాయింపు పై ఆలోచించాలని… వెలిగొండ ప్రాజెక్టు కు నీటి కేటాయింపులు కూడా లేవని లేఖ లో తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. వెలిగొండ అనుమతి లేని ప్రాజెక్టు గా కేంద్రం ప్రభుత్వం గెజిట్ నోటి ఫై చేసింది తెలిపింది తెలంగాణ సర్కార్. అనుమతి లేని ఆ ప్రాజెక్టు కు నిధులు సమకూర్చడం సరికాదని లేఖ లో తెలిపింది.
దీని పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి చేసింది అయితే.. దీని పై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కాగా… ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కృష్ణా నది జలాల విషయం పై తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్యాయంగా వ్యవహరిస్తోందని ఏపీ సర్కార్ ఆరోపిస్తుండగా…. ఏపీదే తప్పు అని తెలంగాణ సర్కార్ గట్టి కౌంటర్ ఇస్తోంది.