వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇవాళ విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పోలీసుల అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇచ్చానని.. విచారణ ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తున్నానని చెప్పారు. మరోసారి నోటీస్ ఇస్తే.. కూడా హాజరవుతానని స్పష్టం చేశారు. పోక్సో కేసుకు సంబంధించిన విషయంలో బాధితురాలి పేర్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తో సహా మరికొందరూ రాజకీయ నేతలు ప్రస్తావించారు.
ఈ అంశం పై తాను అధికారికంగా ఫిర్యాదు చేస్తానని.. చట్టం అందరికీ సమానంగా ఉండాలని అంటున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. కేసులు అడ్డం పెట్టి వైఎస్ జగన్ ని ఆపాలని చూస్తే.. మూతిని అడ్డంపెట్టి సూర్యడిని ఆపాలని చూడటమే అని వ్యాఖ్యానించారు గోరంట్ల మాధవ్. 1970లో ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన పాలనతో గుర్తు చేస్తున్నారని దుయ్యబట్టారు. కూర్చున్నా.. నిల్చున్నా.. మీటింగ్ పెట్టినా.. మాట్లాడినా అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు.