వీణావాణిలకు మరో కష్టం..!

-

ఏళ్ళు గడుస్తున్నా సరే వాళ్ళ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా సరే వాళ్ళను విడదీయడానికి వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మాత్రం ఫలించడం లేదు. అలాగే కాలం నెట్టుకొస్తున్నారు. తల్లి తండ్రుల ఆర్ధిక స్తోమత మాత్రం అంతంత మాత్రమే. దేశ విదేశాల నుంచి వైద్యులు వచ్చి పది కోట్ల వరకు వాళ్ళను విడదీయడానికి ఖర్చు అవుతుంది అని చెప్పారు. దీనితో ఇక వాళ్ళు విడిగా ఉండే అవకాశం లేదని చాలా మందికి స్పష్టత వచ్చేసింది.

ఈ స్టొరీ ఎవరి గురించో మీకు అర్ధమయ్యే ఉంటుంది కదూ…? మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడెం గ్రామానికి చెందిన మురళి, నాగలక్ష్మి దంపతులకు 2002లో అవిభక్త కలలలుగా జన్మించిన వీణా వాణీల గురించి. ఇప్పుడు వాళ్లకు మరో కష్టం వచ్చింది. కష్టపడి పదో తరగతి వరకు వచ్చిన ఆ ఇద్దరు, ఇప్పుడు పరిక్షలు రాయడానికి ఇబ్బంది పడుతున్నారు. 2020 మార్చి నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వీణా-వాణిలు పరిక్షలు రాయనున్నారు. దీనితో వాళ్ళు ఒకరిగా పరీక్ష రాయాలా ఇద్దరు రాయాలా, అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

ఇది తేల్చుకోలేని పరిస్థితులో ఇప్పుడు జిల్లా విద్యాశాఖా అధికారులు ఉన్నారు. విద్యా కమీషనర్ కి కూడా వాళ్ళు లేఖ రాసారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి పరిక్షలు రాయాలి అంటే ఏదోక స్కూల్ విద్యార్ధిగా ఉండాలి. ప్రధానోపాధ్యాయుల నేతృత్వంలోని ఓ కమిటీ వాళ్లకు పదో తరగతి చదివే పరిజ్ఞానం ఉందనే విషయం తేల్చి అడ్మిషన్ నంబర్ 5618, 5619 తో ప్రవేశానికి అనుమతించారు. 12 ఏళ్ల వయస్సులో నీలోఫర్ ఆసుపత్రి నుంచి స్టేట్ హోంలో చేరిన వీణవాణిలు చదువుకుంటున్నారు. దీనిపై స్పందించిన వీణావాణి టీచర్ల సాయంతో బాగా చదువుకుంటున్నామన్నారు. అన్ని సబ్జెక్టులు బాగానే చేస్తున్నామన్న వాళ్ళు మాకు వేర్వేరుగానే పరీక్షలు రాయాలని ఉందని… కానీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని తమ బాధను బయటపెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version