రేవంత్‌రెడ్డి కి మరో సీనియర్ నేత షాక్.. ‘దళిత బంధు’పై ప్రశంసలు

-

టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆ పార్టీ సీనియర్ నేతలు మాత్రం రేవంత్‌కు మద్దతు ప్రకటించలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవిని కొన్నారని ఆరోపించారు. కాగా తాజాగా మరో సీనియర్ నేత రేవంత్‌కు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీ లాంచ్ చేయబోతున్న ‘దళిత బంధు’ స్కీమ్ పట్ల ప్రశంసలు కురిపించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ కాంగ్రెస్ నేత ఎవరు? అనే విషయం తెలియాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ స్కీమ్‌ను తీసుకొచ్చినప్పటికీ ఆ పథకం పట్ల ప్రశంసలు, విమర్శలు రెండూ వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ స్కీమ్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆహ్వానించారు. తెలంగాణలో సుమారు కోటి మంది దళితులు ఉన్నారని, 25 లక్షల కుటుంబాలు ఉన్నాయని వారికి మేలు చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి చూస్తే ఆయన త్వరలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారనే ఊహాగానాలు వినబడుతున్నాయి. ఎవరికీ రాని ఆలోచన కేసీఆర్‌‌కు తట్టిందని, ప్రతీ దళిత కుటుంబానికి రూ.పది లక్షలిచ్చి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని సర్వే అన్నారు. ఈ స్కీమ్ విషయమై రాజకీయాలు చేయడం సరికాదని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం పట్ల అంసతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే ప్రచారం కూడా జరుగుతుండగా, ఆయన మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కానీ, కొంత కాలం నుంచి యాక్టివ్‌గా లేనని పేర్కొంటుడటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version