మరొకసారి కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తున్న అమలాపాల్.!!

-

మొదట ప్రేమ ఖైదీ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది అమలాపాల్. ఆ తర్వాత అదే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా పాపులర్ అయ్యింది. అలా అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే అలా నటించడంతో ఈమెకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు వెలువడుతాయని ఆమె అభిమానుల సైతం భావించారు. అయితే అలా హీరోయిన్ గా తన కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నది. అయితే పెళ్లి తర్వాత ఈమె కెరియర్ అనుకోని విధంగా తలకిందులైందని చెప్పవచ్చు.

ముఖ్యంగా కుటుంబంలోని గొడవలు ఇతర కారణాల వల్ల తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత పూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పటికే తమిళంలో పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా అంతంత మాత్రమే ముందుకు సాగిస్తోంది.

అయితే తరచూ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలోనే ఉంటుంది అమలాపాల్ . సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు హాట్ ఫోటోలతో కుర్రకారుకు సైతం హీట్ పుట్టించే విధంగా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా చేసిన సినిమాలు తక్కువగానే ఉన్నప్పటికీ ఎక్కువగా హాట్ ఫొటోస్ మాత్రమే చేస్తూ ఉంటుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకి కేరాఫ్ అడ్రస్ గా గా మారిపోయింది.. తాజాగా ఒక స్విమ్మింగ్ సూట్ లో కనిపించి కుర్రకారులకు సైతం మరింత హీట్ పెంచింది ఈ మధ్యగుమ్మ. దీంతో కొంతమంది నేటిజెన్లు సైతం అమలాపాల్ అందాల ఆరబోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె కు సంబంధించి ఈ స్విమ్ సూట్ ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ రకంగా నైనా ఈమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version