సాయి ప్రియ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ సంఘటనపై విశాఖ త్రీ టౌన్ సీఐ రామారావు కీలక విషయాలు బయటపెట్టారు. సాయి ప్రియ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేశామని ఆయన ప్రకటించారు. సాయి ప్రియ మొబైల్ స్వాధీనం చేసుకొని అందులో ఉన్న కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టామని.. అప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని అన్ ఇంస్టాల్ చేసి ఉందని వెల్లడించారు.
సాయి ప్రియా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసిన రవి అనే యువకుడు నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టిందని విశాఖ త్రీ టౌన్ సీఐ రామారావు కీలక విషయాలు బయటపెట్టారు. 26న రవి అనే యువకుడి నెంబర్ నెల్లూరు లో ఉన్నట్లు ట్రేస్ చేసామని.. రవి అనే యువకుడితో పరిచయం ఎప్పటి నుండి ఉందనేది తల్లిదండ్రులు చెప్పడం లేదని పేర్కొన్నారు.
రవి సాయి ప్రియా ఉంటున్న ఏరియాలోనే ఉండేవాడని.. రవి ఫోన్ నెంబర్ అడ్రస్ ప్రూఫ్ నెల్లూరు లో తీసుకున్నట్లు గుర్తించామని స్పష్టం చేశారు. నెల్లూరు మీదుగా బెంగళూరు వెళ్లినట్లు గుర్తించామని.. వారిద్దరూ మేజర్లు, పెళ్లి చేసుకున్నట్లు ఫొటోస్, ఆడియో మెసేజెస్ పంపించారని తెలియజేశారు. ఇప్పటి వరకు అయితే సాయి ప్రియా తల్లిదండ్రులు తన అమ్మాయి విషయం లో మిస్సింగ్ కేసు తప్పితే ఇంకో ఫిర్యాదు ఇవ్వలేదని.. పిర్యాదు ఇస్తే దర్యాప్తు చేస్తామన్నారు విశాఖ త్రీ టౌన్ సీఐ రామారావు.