ఆన్లైన్ బెట్టింగులకు మరో యువకుడు బలయ్యాడు. ఈ ఘటన నిన్న చోటుచేసుకోగా.. తాజాగా దానిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘ఆన్ లైన్ బెట్టింగ్ భూతం డిగ్రీ విద్యార్థిని బలి తీసుకుంది.చేతికి అందిన బిడ్డ బీఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసి వ్యవసాయ అధికారిగా స్థిరపడతాడునుకున్న తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసింది.
యువకుల్లారా!! ఈజీ మనీకి అలవాటుపడి బెట్టింగ్ కూపంలోకి వెళ్ళకండి.బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, బెట్టింగు యాపుల బారిన పడి ఇప్పటికే అనేక మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సజ్జన్నార్ అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ పోస్టు చేసినట్లు సమాచారం.
https://twitter.com/SajjanarVC/status/1899320425089483019