సూపర్ హీరో ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. ఈనెల 17న ‘యాంట్‌మ్యాన్‌ అండ్‌ ది వాస్ప్‌’ విడుదల

-

సూపర్‌హీరో సినిమాల అభిమానులకు గుడ్​న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాంట్​మ్యాన్ వచ్చేస్తున్నాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ వస్తున్నాడు. ఈనెల 17న ‘యాంట్‌- మ్యాన్‌ అండ్‌ ది వాస్ప్‌: క్వాంటమేనియా’ సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

స్కాట్‌ లాంగ్‌ (యాంట్‌-మ్యాన్‌), హోప్‌ వాన్‌ డైన్‌ (వాస్ప్‌)లు మూడవ యాంట్‌- మ్యాన్‌లో వారి సాహసాలను కొనసాగించడానికి తిరిగి వచ్చారు. హోప్‌ తల్లిదండ్రులు, మిగిలిన కుటుంబంతో కలిసి క్వాంటం రాజ్యాన్ని అన్వేషించడమే కాదు అక్కడ వింత జీవులతో మాట్లాడతారు. దీని వల్ల వారు తమ శక్తులకు మించి సాహసించాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది. ఆ తర్వాత యాంట్‌ మ్యాన్‌ సాహసాలు ఏవిధంగా సాగాయనేది ఆసక్తికరం.

2015లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తర్వాత ఈ సిరీస్‌లో మార్వెల్‌ స్టూడియోస్‌ నుంచి ‘యాంట్‌- మ్యాన్‌ అండ్‌ ది వాస్ప్‌’ వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సిరీస్‌లో ముచ్చటగా మూడో చిత్రంగా ‘యాంట్‌- మ్యాన్‌ అండ్‌ ది వాస్ప్‌: క్వాంటమేనియా’ రాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version