బ్రిటన్‌లో రాచరికాన్ని రద్దు చేయాలని నిరసనలు.. ట్రెండింగ్‌లో ‘నాట్‌ మై కింగ్‌’ హాష్‌ట్యాగ్‌

-

బ్రిటన్‌లో రాచరిక వ్యవస్థపై కొందరు వ్యతిరేక గళమెత్తారు. రాచరికాన్ని రద్దు చేయాలని డిమాండ్లు చేస్తూ రోడ్డెక్కారు. రాచరికాన్ని వ్యతిరేకిస్తూ.. రాజకుటుంబాన్ని వెక్కిరిస్తూ.. నినాదాలు, పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకొని వీధుల్లో నినాదాలు చేస్తున్నారు.

ఎలిజబెత్‌ రాణి మరణంతో.. బ్రిటిష్‌ రాజరికంపై దాడి మొదలైంది. ఒకవైపు తమ మహారాణి మరణానికి వేలమంది సంతాపం తెలుపుతుంటే.. మరోవైపు రా;రికాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. రాజ్యాధిపతిగా పదవి చేపట్టిన ప్రిన్స్‌ ఛార్లెస్‌ను రాజుగా గుర్తించటానికి నిరాకరిస్తూ వీధుల్లో.. సామాజిక మాధ్యమాల్లో ‘నాట్‌ మై కింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ వీరవిహారం చేస్తోంది!

“రాచరికం అగౌరవప్రదమైంది. ఎవరైనా పుట్టుకతోనే పాలకులై పోయే పద్ధతిని నేను అంగీకరించను” అంటూ ప్రస్తుత ప్రధాని ట్రస్‌ 30 సంవత్సరాల కిందట మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటపడటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version