ఆదివాసీ తొలి మహిళా పైలట్‌గా అనుప్రియా!

-

కనీస సౌకర్యాల కరువైనా.. తన లక్ష్యానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కన్న కలలను సాకారం చేసుకుని దేశంలో తొలి గిరిజన ప్రాంతానికి చెందిన పైలట్‌గా అనుప్రియ రికార్డు సృష్టించింది. వివరాల్లోకి వెళితే…

గిరిజన గూడాల్లో పుట్టిన ఓ అడవి బిడ్డ ఆకాశానికెగిరింది. ఒడిశాలోని మల్కాన్‌గిరి గిరిజన ప్రాంతానికి చెందిన అనుప్రియా లక్రా(23) తొలి మహిళా పైలట్‌గా అవకాశాన్ని దక్కించుకుంది. కమర్షియల్ విమానాన్ని నడిపే ఆదివాసీ మహిళా పైలట్‌గా అనుప్రియ లక్రా చరిత్ర సృష్టించారు. తొలి గిరిజన యువతి గా ఈ రికార్డు సృష్టించినది అనుప్రియానే .

అనుప్రియ పైలట్ ఎలా అయ్యింది?

గిరిజన ప్రాంతంలో పుట్టిన తన చిన్నతనం నుంచి పైలట్ కావాలని కలలు కన్నది అనుప్రియ. 2012లో ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పైలట్ ప్రవేశ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యింది. అందులో ఉత్తీర్ణత సాధించి భువనేశ్వరన్‌లోని పైలట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరింది. ఏడేళ్ల పాటు కష్టపడి ఇటీవలే ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో కో-పైలట్‌గా ఉద్యోగం సాధించింది. త్వరలోనే కమర్షియల్ ఫ్లైట్స్‌ను నడపనున్నది.

అభినందించిన సీఎం

పైలట్‌గా ఎంపిక కావడంతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అనుప్రియకు అభినందనలు తెలియజేశారు. అనుప్రియ లక్రా గురించి తెలిసి చాలా ఆనందపడ్డాను. నిబద్ధత, పట్టుదలతో ఆమె అరుదైన విజయాన్ని సాధించారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు అంటూ పట్నాయక్ ప్రశంసించారు.
కలలు కంటే సరిపోదు.. కలలను సాకారం చేసుకునే వరకు అహర్నిశలు శ్రమించాలి. అంతే ఎక్కడ పుట్టాం, డబ్బు ఉందా? అవకాశాలు ఉన్నాయా వంటి అంశాలు అసలు అడ్డంకులు కావు. కేవలం సంకల్ప బలం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని ఎందరో నిరూపించారు. అటువంటి సంఘటనలలోనే అనుప్రియ విజయం. మీరు కూడా ఎప్పుడైనా.. ఎక్కడైనా… విజయాన్ని సాధించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version