అమెరికాను వణికించిన కార్చిచ్చు.. 50 బిలియన్ డాలర్ల నష్టం!

-

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ రాష్ట్రాన్ని కార్చిచ్చు వణికించింది. బిలియనీర్లు ఎక్కువగా నివసించే పసిఫిక్‌ పాలిసేడ్స్‌తో పాటు పలు చోట్ల గత రెండు రోజులుగా కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. ఈ కార్చిచ్చు బారిన పడి ఇద్దరు మృతి చెందగా, వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది.

మొత్తం 3 వేలకు పైగా విస్తీర్ణంలో ఉన్న 10 వేలకు పైగా ఇండ్లు మంటల్లో చిక్కుకోని దగ్ధమయ్యాయి. కార్చిర్చు కారణంగా 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీ ఫైర్‌ చీఫ్‌ ఆంటోని మార్రోన్‌ వెల్లడించారు. మెట్రోపాలిటన్‌లో మూడు వేర్వేరు ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నాయని తెలిపారు. వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేపనిలో నిమగ్నమయ్యారని, విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version