అనుష్క దేశ ద్రోహి… కోహ్లీ విడాకులు ఇవ్వాలి…!

-

ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని బిజెపి నేతలు ఈ మద్య కాలంలో ఎక్కువగా దేశ భక్తి విషయంలో కాస్త శృతి మించి వ్యాఖ్యలు చేస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. దేశ భక్తి, అమ్మ మీద ప్రేమ, తండ్రి మీద గౌరవం బయటకు చెప్పేవి కాదు. అయినా సరే వాళ్ళు పదే పదే తమ దేశ భక్తిని బయటపెట్టి ఏదో సాధించాలి అనే తపనతో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దీని వలన అంతిమంగా పార్టీ కూడా ఇబ్బంది పడుతుంది.

తాజాగా ఉత్తరప్రదేశ్ బిజెపి ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్యకు విడాకులు ఇవ్వాలి అనే సలహాను ఆయన చేసారు. అసలు మేటర్ ఏంటీ అనేది ఒకసారి చూస్తే… ఇటీవల అనుష్క నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ‘పాతాళ్‌లోక్‌’ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై మంచి స్పందనతో దూసుకుపోతుంది. అయితే ఇందులో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని…

తన అనుమతి లేకుండా ఫొటో వాడారని… నందకిశోర్‌ నిర్మాత అనుష్క శర్మ పై కేసు పెట్టారు. వెబ్ సీరీస్ ని నిషేధించాలి అని కూడా ఆయన డిమాండ్ చేయడం విశేషం. పోలీసులకు చేసిన ఫిర్యాదులో అనుష్క దేశ ద్రోహి అనే ఆరోపణలు కూడా నంద కిషోర్ చేసారు. తాజాగా కిషోర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. విరాట్‌ కోహ్లీకి దేశభక్తి ఉందని… ఆయన భారత్‌ తరఫున ఆడుతున్నారన్నారు. ఆయన అనుష్కకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version