బికినీలో అనుష్క శర్మ.. ఆడుకుంటున్న నెటిజన్లు..!

-

అనుష్క శర్మ ఎండలో బీచ్ దగ్గర బికినీలో సేదదీరుతున్న ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్లు ఎప్పుడు సందు దొరుకుతుందా.. ఎవర్ని ఆడుకుందామా.. అని ఆలోచిస్తుంటారు. ఇక సెలబ్రిటీలు ఏదైనా పొరపాటు చేసి దొరికిపోయినా.. లేదా మరే ఇతర కారణాల వల్లనైనా వార్తల్లో నిలిస్తే.. వారిని నెటిజన్లు టార్గెట్ చేసి ఫన్నీ ఫొటోలు, కామెంట్లతో ట్రోల్ చేస్తుంటారు. ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే తాజాగా ఎదురవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

అనుష్క శర్మ ఎండలో బీచ్ దగ్గర బికినీలో సేదదీరుతున్న ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పలు రకాల ఫొటోలు పెడుతున్నారు. వాటిల్లో అనుష్క శర్మ బికినీ ఫొటోను రకరకాలుగా మార్ఫింగ్ చేసి షేర్ చేస్తుండడంతో.. ఇప్పుడా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అనుష్క శర్మ బీచ్‌లో బికినీ వేసుకుని దిగిన ఆ ఫొటో ఏమోగానీ.. నెటిజన్లు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫొటోను అనేక రకాలుగా మార్చి ట్విట్టర్‌లో పెడుతున్నారు. ఆ ఫొటోలన్నీ తెగ నవ్వు తెప్పిస్తుండడం విశేషం. ఏది ఏమైనా.. ఎప్పుడూ ఎవరో ఒక సెలబ్రిటీ నెటిజన్ల బారిన పడుతుంటారు. ఇప్పుడు మాత్రం అనుష్క శర్మ వంతైంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version