ఈ నెల 22 నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగించనున్నారు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఈ అసెంబ్లీ సెషన్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.పూర్తి స్థాయి బడ్జెట్ను అక్టోబర్లో ప్రవేశ పెట్టే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. వీటితో పాటు శ్వేతపత్రాలపై కూడా అసెంబ్లీలో చర్చించనున్నారు. ఈ నెల 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.