తాడిపత్రికి వస్తే… పంచె ఊడదీసి కొడతానంటూ కేతిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు జెసి ప్రభాకర్ రెడ్డి. తన ట్రావెల్స్ పై, తనపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి డిటిసి, ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు… ఈ నెల 24న అనంతపురం వన్ టౌన్ లో ఫిర్యాదు చేయబోతున్నానని తెలిపారు. పేర్ని నాని, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, డిటిసి లపై ఫిర్యాదు చేస్తాను… పోలింగ్ రోజు అల్లర్లలో మేము ఇచ్చిన ఫిర్యాదు పై కేసులు నమోదు చేయలేదని ఆగ్రహించారు.
న్యాయం జరిగే వరకు తాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కదలను… కొత్తగా వచ్చిన ఎస్పీ తమను ఇబ్బందులు పెట్టిన కేసులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫ్యాషన్ చేస్తా అని గతంలో మాట్లాడాడు… మాకు ప్రాణాని ఉంది…కేతిరెడ్డిని తాడిపత్రి, అనంతపురం ,ఏపీ నుంచి బహిష్కరించాలని కోరారు.కేతిరెడ్డి జీవితం గన్ మెన్ ల తోనే సాగింది… పోలింగ్ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి తమ కార్యకర్త సూర్యముని ఇంటిపై దాడి చేశారని ఫైర్ అయ్యారు. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఇద్దరు కుమారులను బహిష్కరించాలి…మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతానని హెచ్చరించారు.