హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని… దీని కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామని ప్రగల్బాలు పలికిన వైసీపీ కౌన్సిలర్లు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. హేయమైన, నీచమైన రాజకీయాలను చూడలేదని ఆయన విమర్శించారు. హిందూ పురాన్ని జిల్లా కేంద్రంగా చేయడానికి అన్ని వసతులు ఉన్నాయని ఆయన అన్నారు. హిందుపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి.. సత్యసాయి జిల్లాగా పేరుపెట్టాలని డిమాండ్ చేశారు.