విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం నడుబిగించింది. ఈమేరకు ఏపీ, తెలంగాణ సీఎస్ లకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ నెల 17న విభజన సమస్యలపై చర్చించడానికి ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించింది. ఏపీ విభజన జరిగి ఎనిమిదేళ్ల కావస్తున్నా.. ఇంకా చాలా సమస్యలు అలాగే ఉన్నాయి. వీటిపై గతంలో కూడా ఇరు రాష్ట్రాలు పరిష్కరించాలంటూ కేంద్రాన్ని కోరాయి. తాజాగా ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్రం ఇరు రాష్ట్రాలను చర్చలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తొమ్మది కీలకాంశాలు చర్చకు రానున్నట్లు తెలసింది.
ఏపీ, తెలంగాణ సీఎస్ లకు కేంద్రం లేఖ… విభజన సమస్యలపై 17న సమావేశం
-