మొహర్రం సందర్భంగా ముస్లీం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ‘‘మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి ప్రతీక మొహర్రం. ధర్మ పరిరక్షణ, మానవసేవ, త్యాగం వంటి మహత్తర సందేశాన్ని మొహర్రం గుర్తు చేస్తుంది. మొహర్రం స్ఫూర్తిగా మనమంతా మానవతావాదానికి పునరంకితమవుదాం’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.
అలాగే రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముస్లీం సోదరులకు మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన త్యాగానికి గుర్తుగా మొహర్రం జరుపుకుంటారు. అలాగే కరోనావేళ రాష్ట్రంలోని ముస్లింలందరూ ఇళ్లలోనే మొహర్రం కార్యక్రమాలను పూర్తిచేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి ప్రతీక మొహర్రం. ధర్మ పరిరక్షణ, మానవసేవ, త్యాగం వంటి మహత్తర సందేశాన్ని మొహర్రం గుర్తు చేస్తుంది. మొహర్రం స్ఫూర్తిగా మనమంతా మానవతావాదానికి పునరంకితమవుదాం.#Muharram2020
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 28, 2020