ఏపీ కరోనా : 6,751 కేసులు, 41 మరణాలు !

-

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,751 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 700235కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 41 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 5869కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 57858 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి.

ap-corona

 

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 636508కు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 71,577 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటిదాకా 58,78,135 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలానే జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 333, చిత్తూరులో 888, తూర్పు గోదావరి జిల్లాలో 986, గుంటూరులో 594, కడపలో 400, కర్నూలులో 783, కృష్ణా జిల్లాలో 301, నెల్లూరులో 277, ప్రకాశంలో 275, శ్రీకాకుళంలో 362, విశాఖపట్నంలో 235, విజయనగరంలో 298, పశ్చిమ గోదావరిలో 753 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version