ఆంధ్రప్రదేశ్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 845 కొత్త కేసులు నమోదయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. 281 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా..
మరో ఐదుగురు మరణించారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, అనంతపూర్, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. తాజా లెక్కలతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16097కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 7313 మంది కోలుకోగా.. 198 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 8586 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.