ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి కరోనా

-

చిత్తూరు: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి కరోనా సోకింది. రెండు రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, నీరసం రావడంతో నారాయణస్వామిని కుటుంబసభ్యులు తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనకు అక్కడ పరీక్షలు చేయడంతో కరోనా పాటిజివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం నారాయణ స్వామికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. తన నివాసంలోనే ఉంచి నారాయణస్వామిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

ఇటీవల కాలంలో నారాయణ స్వామి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో తనతో ఉన్న వారు కూడా కరోనా చికిత్స చేయించుకోవాలని నారాయణ స్వామి సూచించారు. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు. మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. కరోనా వస్తే ఎవరూ భయపడొద్దని, ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో మెరుగైన వైద్యం అందిస్తోందని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version