ప్రజలు అందరూ కరోనా కారణంగా కూడా క్లిష్ట పరిస్తితులను ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది తినడానికి తిండి లేక పస్తులు ఉంటున్నారు. బీద బీక్కిఆకలికి తో అలమటిస్తున్నారు. దినసరి కూలీలు చేసేందుకు పనులు లేక సంపాదన లేక వారికి కుటుంబ పోషణ కష్టం అవుతుంది.
అటువంటి వారిని ఆదుకునేందుకు ముందుకు రావడానికి అవకాశం ఉన్నవారు స్పందించే విధంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పవాణి ఒక ఆలోచన చేశారు. తన భర్తతో కలిసి కూరగాయలు తరిగి రెండు వందల మందికి స్వయంగా భోజనం తయారు చేసి పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక ఛాలెంజ్ విసిరారు.
తన అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు తనలా చేయాలని సామాజిక మాధ్యమాల వేదికగా సవాల్ విసిరారు. ఈ విపత్కర సమయంలో ప్రతి ఒక్కరూ మానవతా ధృక్పథంతో తోటి వారిని ఆదుకోవాలని పిలుపు నిచ్చారు. . ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు ఆకలితో ఉన్న తోటి వారి ఆకలి తీర్చి వారిని ఆదుకోవాలని పిలుపు నిచ్చారు.