ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. గౌరవ పరిశీలకుడిగా మాజీ ఎన్నికల అధికారి !

-

ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాజీ ఎన్నికల అధికారి నాగిరెడ్డిని ఏపీ పంచాయతీ ఎన్నికలకు గౌరవ పరిశీలకుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా అలాగే పరిపాలన లో కూడా వివిధ హోదాల్లో పనిచేసిన నాగిరెడ్డి సేవలు అనుభవాలు ఎన్నికల నిర్వహణలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నామని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన మాజీ ఎన్నికల కమిషనర్లు, అలాగే ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ లుగా పనిచేస్తున్న వారి సేవలను వినియోగించుకోవడానికి వారిని ఆహ్వానించాలని నవంబర్ 6 2020 వ తేదీన జరిగిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ల స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది అని ప్రకటనలో పేర్కొన్నారు. మన దేశంలో ఢిల్లీ, చండీగఢ్, మహారాష్ట్ర, మిజోరాం, మధ్యప్రదేశ్, హర్యానా అలాగే కర్నాటక రాష్ట్రాల్లో ఈ విధానం ఇప్పటికీ అమలులో ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు దేశంలో అందుబాటులో ఉన్న ప్రతిభను వాడుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తోందని ప్రకటనలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version