ఇలా చేస్తే చాలా చాలా కష్టం జగన్ గారూ !

-

మూడు రాజధానుల విషయంలో ఏపీ హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చట్టం అయ్యేంతవరకు రాజధాని అమరావతి నుండి ఎలాంటి శాఖలు ప్రభుత్వం తరలింపు చేయకూడదని అలా చేసినచో సదరు అధికార వ్యక్తిగత ఖాతాలలో నుంచి సొమ్ము వసూలు చేస్తామని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే తరుణంలో ఏసీబీ మరియు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేత కూడా విచారణ జరిపిస్తామని వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అయితే హైకోర్టు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం మూడు రాజధానుల విషయంలో చాలా దూకుడుగా వ్యవహరించడానికి రెడీ అయిపోయినట్లు… న్యాయస్థానం డి అంటే డి అన్నట్టు వ్యవహరించడానికి పూనుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తుంది.

ఏకంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన వాటిని బేఖాతరు చేస్తూ జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మేటర్ లోకి వెళ్తే రాయలసీమ ప్రాంతం కర్నూలుకు న్యాయ విభాగాలకు సంబంధించిన కొన్ని కార్యాలయాలను..తరలించడానికి ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ సభ్యుల ఆఫీస్‌లను కర్నూలుకు తరలించాలని ఆదేశిస్తూ.. అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ విభాగాలు.. వెలగపూడి సచివాలయంలో ఉన్నాయి.

 

జగన్ నిర్ణయంతో వెలగపూడి లో ఉండాల్సిన ఈ కార్యాలయాలు కర్నూల్ కి తరలిస్తున్న నేపథ్యంలో సదరు ప్రభుత్వ న్యాయ విభాగాలకు సంబంధించి పని చేస్తున్న ప్రభుత్వ అధికారుల్లో టెన్షన్ నెలకొన్నట్లు…తమ దగ్గర నుండి హైకోర్టు డబ్బుల రూపంలో ఫైన్ కట్ చేస్తుందన్న భయం లో ఉన్నట్లు ఇలా అయితే సీఎం జగన్ గారు కష్టమని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మా జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు అని అంటున్నట్లు సమాచారం.  

Read more RELATED
Recommended to you

Exit mobile version