తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగార్జునసాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నిధులు విడుదల చేస్తున్న… తెలంగాణ తీర్పు పై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ చేస్తోన్న నీటి విడుదలను అడ్డుకోవాలని కృష్ణా బోర్డుకు తాజాగా ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.
వేసవిలో తాగునీటి అవసరాలకు లేకుండా…. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని దుర్వినియోగం చేస్తుందని లేఖలో స్పష్టం చేసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం ముందస్తు అనుమతి లేకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని నిలువరించాలని ఏపీ ప్రభుత్వం కోరింది.
ఎం ఎస్ పీ నుంచి పులిచింతల ప్రాజెక్టు లోకి నీరు భారీగా వస్తోందని… ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 40.580 టీఎంసీలు అని పేర్కొంది. నాగార్జున సాగర్ నుంచి వదిలే నీరు ద్వారా పులిచింతల రిజర్వాయర్ నీటి మట్టం అసాధారణంగా పెరుగుతోందని వెల్లడించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాలని డిమాండ్ చేసింది.