ఏపీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌…5వ తేదీ లోగానే జీతాలు

-

ఏపీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌. జీతాలు చెల్లించడంపై జగన్‌ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతినెల 5వ తేదీ నాటికి 90-95% ఉద్యోగుల జీతాలు ప్రభుత్వం చెల్లిస్తోందని రాష్ట్ర ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.

cm jagan

మిగిలిన 5% మందికి ఖజానాల్లో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రిజర్వు బ్యాంకు, బ్యాంకుల సెలవులు, నిధులు అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ చెల్లింపులు సాగుతున్నాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version