సీఎం వైఎస్ జగన్ కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లెటర్ రాయడం జరిగింది. కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైలులో ఉన్న ఖైదీలను బెయిల్/పెరోల్ లపై విడుదల చేయాలని చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు పై వెయ్యి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటనపై మండిపడ్డారు. వెయ్యి రూపాయలు ఎవరికీ సరిపోవని ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని సూచించారు.
జైళ్లలో పరిశుభ్రమైన వాతావరణం ఏ మేరకు ఉంటుందో మనకు తెలియంది కాదని, ఏ మాత్రం అలక్ష్యం ఉన్నా జైళ్లలో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని దీంతో విచారణ ఎదుర్కొంటున్న ముద్దాలను బెయిల్ పైన, శిక్షపడిన ఖైదీలను పెరోల్ పైన విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ సీఎం జగన్ ని కోరడం జరిగింది.