టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు జగన్మోహన్రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్మోహన్రెడ్డి సర్కార్. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రకటన ప్రకారం రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 100% ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడువనున్నాయి.
కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో గత నెల రోజుల క్రింద 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడవాలని జగన్మోహన్రెడ్డి యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా మహమ్మారి కేసులు గత పది రోజుల నుంచి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో థియేటర్ల పై ఆంక్షలు ఎత్తి వేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 675 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనాతో బాధపడుతూ మరణించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 2414 మంది కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,808 యాక్టివ్ కేసులు ఉన్నాయి.