దిగి వచ్చిన ఏపీ సర్కార్, అంతే చెల్లిస్తాం…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా నియంత్రణ కట్టడిలో భాగంగా ఎక్కువ టెస్టులు చేయడానికి గానూ దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసిన కిట్స్ కి అధిక ధర చెల్లించింది అనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో దీనిపై స్పందించింది. ఛత్తీస్‌గఢ్‌లో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఒక్కొక్కటి రూ.337 చొప్పున కొనుగోలు చేయగా ఏపీ సర్కార్ ఒక్కో కిట్‌కు రూ.730 చెల్లించిందని ప్రచారం జరుగుతుంది.

2 లక్షల కరోనా టెస్ట్ కిట్లను కొనుగోలు చేయగా.. అందుకు రూ.14.60 కోట్ల ఖర్చు అయ్యిందని పేర్కొంది. అంటే ఏపీ సర్కార్… ఎక్కువగా చెల్లించింది. 8 లక్షల కిట్లను ప్రభుత్వం ఆర్డర్ చేసింది. 25 శాతం ధర రూ.14.60 కోట్లుగా ఉంది. తొలి దశలో భాగంగా లక్ష కిట్లు దిగుమతి చేసుకున్నారు. ఈ నేపధ్యంలో స్పందించిన ఏపీ సర్కార్… ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.330 కి కొంటే ఏపీ ప్రభుత్వం రూ.730కి కొనడంపై విమర్శలు వచ్చాయి.

కరోనా ర్యాపిడ్ కిట్లను ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే తక్కువ రేటుకు కొనుగోలు చేసిందో… ఆ రేటు ప్రకారమే తాము కూడా చెల్లిస్తామని ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికైతే ఛత్తీస్‌గఢ్ తక్కువ రేటుకే కొందని, ఆ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన మొత్తానికే ర్యాపిడ్ కిట్లకు డబ్బు చెల్లిస్తామని స్పష్టం చేసింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు రావడంతో ఏపీ సర్కార్ దిగి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version