మెడికల్ షాపుల్లో హైడ్రోక్సీక్లోరోక్విన్ విక్రయించడంపై ఆంక్షలు

-

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ కరోనా వైరస్ నియంత్రణకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అయినా కూడా ప్రభుత్వ కష్టాన్ని అర్ధం చేసుకోని కొందరు… ఇంకా వారికున్న వైరస్ ను దాస్తూ, దాగుతూ.. చాపకింద నీరులా వైరస్ ను వ్యాప్తిచెందిస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. భౌతిక దూరం అనే విషయం కూడా ఇప్పటికీ పాటించనివారు చాలామందే ఉన్నరని తెలుస్తుంది. ఈ క్రమంలో చాలా మంది సొంత వైద్యం చేయ నిర్ణయించుకుంటున్నారట… దీంతో ఏపీ సర్కార్ మెడికల్ షాపులకు మరో కండిషన్ పెట్టింది!

అమెరికా వంటి అగ్రరాజ్యమే భారత్ నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును దిగుమతి చేసుకుంటుంది… అదే కరోనాకు వ్యాక్సీన్ అని ఇప్పటికీ పలువురు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే మలేరియాకు సంబంధించిన ఈ మందును అధికమోతాదులో వాడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరగడం తెలిసిందే! ఈ క్రమంలో క్వారంటైన్ కో, ఐసోలేషన్ కో వెళ్లడాన్ని అదేదో జైలు శిక్షగా భావిస్తున్న కొందరు మాత్రం… మెడికల్ షాపుకెళ్లి హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు కొని.. వాడేస్తున్నారని తెలుస్తోందట!! దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని… ఏపీలోని మెడికల్ షాపులకు హైడ్రోక్సీక్లోరోక్విన్ మందు విక్రయించడంపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది!

ఈ మేరకు… ఆంధ్రప్రదేశ్ లోని ఏ మెడికల్ షాప్ లో కూడా మలేరియా వ్యాధికి సంబంధించిన మందు హైడ్రోక్సీక్లోరోక్విన్ ను ప్రజలకు విక్రయించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కార్. కేవలం వైద్యులు సూచిస్తే తప్ప ప్రజలకు ఈ మందును అమ్మకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఎవరికైనా కరోనా వైరస్ సోకిన వారికి మాత్రమే హైడ్రోక్సీక్లోరోక్విన్ మందులు ఉపయోగించాలని, కరోనా సోకిన వారి కుటుంబీకులు ఈ మందులు వాడాలి.. అదికూడా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే అని సర్కార్ స్పష్టం చేస్తుందట! ఈ మందేదో కరోనా విషయంలో సంజీవని అనే భ్రమలు జనాలు ఎప్పుడు వదిలేసుకుంటారో!!

Read more RELATED
Recommended to you

Exit mobile version