దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు గానూ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. అవసరమైతే ప్రజలు ఇబ్బంది పడినా సరే కఠిన చర్యలను అమలు చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోం ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి.
ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించిప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం కర్ఫ్యూ పూర్తయ్యే వరకు కూడా బస్సులు తిరగావద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం నాడు ఆర్టీసీ బస్సులో ఒక్కటి కూడా బయట తిరగకూడదు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో చెప్పారు .
ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూను కఠినంగా అమలు చేసేందుకు కూడా వెనకాడే పరిస్థితి లేదని అంటున్నారు. ఎక్కడా కూడా ప్రజలు అలసత్వం ప్రదర్శించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అని ప్రధాని నరేంద్ర మోడీ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి గానూ అన్ని ప్రభుత్వ విభాగాలను ప్రభుత్వాలు ఎలర్ట్ చేశాయి.