BIG BREAKING : ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ..

-

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. నాయీ బ్రాహ్మణులు, వారి సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్న కొన్ని పదాలపై నిషేధం విధించింది ఏపీ సర్కార్‌. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి గురువారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయం పట్ల నాయీ బ్రహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయీ బ్రహ్మణులు, వారి సామాజికవర్గానికి చెందిన వారిని కించపరిచేలా మంగలోడు, బొచ్చుగొరిగేవాడు, మంగలిది, కొండ మంగలోడు వంటి పదాలను వాడవద్దంటూ ప్రభుత్వం నిషేధం విధించింది ఏపీ సర్కార్‌. అలాకాకుండా కించపరుస్తూ మాట్లాడేవారిపై భారత శిక్ష్మాస్మృతి 1860 కింద చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ సర్కార్‌. ఏపీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీబ్రహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇతంటి సంచలన ఉత్తర్వులు జారీ చేసిన సీఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. పలు ప్రాంతాల్లో జగన్‌ చిత్రపటానికి పాలతో అభిషేకించి.. జగన్‌ను కీర్తిస్తూ నినాదాలు చేశారు. జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందంటూ ఏపీ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం అభివర్ణించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులకు జగనన్న చేదోడు పథకం అమలు చేస్తూ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని తెలిపారు. తమ సామాజికవర్గాన్ని ఉన్నతంగా ఉంచేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆయన అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version