పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..!

-

ఏపీ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల మార్క్స్ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు బోర్డ్ వెబ్‌సైట్‌లో మార్స్ మెమెలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తీసుకోవచ్చని పేర్కొంది. ఇంటర్నల్ మార్క్స్, మెరిట్ ఆధారంగా ఫలితాలను లెక్కగట్టారు. అలాగే లాంగ్ మెమోలను సంబంధిత స్కూళ్లకు పంపనుంది. విద్యార్థులు తమ స్కూళ్ల నుంచి ఒరిజినల్ మార్క్స్ మెమోలు తీసుకోవచ్చని తెలిపింది.

ఇకపోతే కరోనా కారణంగా వాయిదా పడిన పరీక్షలను రద్దు చేస్తూ.. 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అని బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటగా విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత SSC Public Examinations March 2020 Student Result & Short Memo Without Photo అనే లింక్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవ్వగానే అందులో విద్యార్థులు రోల్ నంబర్ ఎంటర్ చేసి.. సబ్మిట్  పైన క్లిక్ చేస్తే స్క్రీన్ పైన టెన్త్ మెమో కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version