రాజధాని కేసులపై రేపటి నుంచి రోజు వారీ విచారణ హైకోర్టులో వర్చువల్ గా జరగనుంది. విశాఖలో నూతన గెస్ట్ హౌస్ నిర్మాణం, కోర్టు ధిక్కరణ పై సీఎస్ సంతకంతో కౌంటర్ దాఖలు చేయాలని గతంలో ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై గత నెల 21న కౌంటర్ దాఖలు చేయటానికి ప్రభుత్వం సమయం కోరింది.
సోమవారం నుండి రాజధాని కేసులలో అంశాల వారీగా పిటిషన్లు విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఢిల్లీ నుండి వచ్చే న్యాయవాదులు హై బ్రిడ్ సిస్టం ద్వారా వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా అందుకు సంబంధించి ధర్మాసనం రేపు నిర్ణయం తీసుకోనుంది. రాజధాని విషయంలో ఏపీ సర్కార్ ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. ప్రజలు, ప్రతిపక్షాలు అన్నీ వ్యతిరేకిస్తున్నా సరే ప్రభుత్వం మాత్రం రాజధాని తరలింపుకే ప్రయత్నాలు చేస్తోంది.