సినిమా టికెట్ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టికెట్ల ధరల పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు జగన్ ప్రభుత్వం వెళ్ళింది. జీవో నెంబర్ 35 ను సస్పెండ్ చేస్తూ సివిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం కోరింది. సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు థియేటర్ యజమానులు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని న్యాయవ్యవస్థ ఆదేశించింది.
టికెట్ ధరల పై జేసీ నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా టికెట్ ధరల నిర్ణయంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక అటు టికెట్ల ధరలను పెంచుకునే ఛాన్స్ ఇవ్వాలని ఏపీలో మొదటి నుంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.