ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఫీజుల రద్దు !

-

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఈ ఏడాది అడ్మిషన్ సహా వివిధ రకాల ఫీజులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రీ అడ్మిషన్లు, మీడియం లేదా గ్రూప్ మార్పులకు సంబంధించి వసూలు చేసే ఫీజు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా అంశాలకు సంబంధించి ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాల్లో ఎవరి దగ్గర ఫీజులు వసూలు చేయవద్దని ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్ లకు కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కరోనా కారణంగా ఈ ఏడాది ప్రభుత్వం అనేక రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తూ వస్తోంది అందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పించే విధంగా ఈ ఫీజులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించినట్లు సమాచారం అందుతుంది. దీంతో రీ అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్నా లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్ , ఇంగ్లీష్ నుంచి తెలుగు మీడియం కి మారాలి అనుకున్నా, వేరే గ్రూపులో కి మారాలి అనుకున్నా ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే ఆ అవకాశం పొందే ఛాన్స్ ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version