ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబుకు, టీడీపీ నేతలకు మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా విమర్శలకు పనిచెప్పారు. లోకేష్ మరోసారి పప్పు అని నిరూపించుకున్నాడని ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. కిన్నెర ప్రసాద్ కు నేను బినామీ అని లోకేష్ అంటున్నారని…అక్రమ లే ఔట్లులోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని ప్రభుత్వం స్పష్ఠమైన ఆదేశాలు ఇచ్చిందని… ఇది కూడా తెలియదా..? నన్ను కిన్నెర ప్రసాద్ కు బినామీ అని పప్పు ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు.