తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి మద్యపాన నిషేధం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని.. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే.. ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వైన్ షాపులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూంలు పెట్టి మద్యాన్ని పారించిన వ్యక్తి అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఈనాడు రామోజీ రావు తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉంటే మద్యంపై ఆదాయాన్ని పొగొట్టుకోవద్దని కథనాలు రాశారని.. ఈనాడు రామోజీ రావుకు వయసు వచ్చింది కానీ బుద్ధిరాలేదని ఆయన విమర్శించారు.
ఎన్టీఆర్ మద్యపాన నిషేధం చేస్తే… చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులు తెరిచాడు: కొడాలి నాని
-