సీఎం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్. ఆడబిడ్డలు బలైపోతుంటే.. సీఎం జగన్ మహిళలను అవహేళన చేసే విధంగా మాట్లాడటం విచారకరం అని వ్యాఖ్యానించారు. విజయవాడ, గుంటూర్ లో ఏదో జరిగిందని నానా యాగీ చేస్తున్నామంటూ సీఎం అవహేళన చేస్తున్నారని విమర్శించారు. ఇటాంటి ఘటన సీఎం ఇంట్లో జరిగితే ఇంతే వెటకారంగా మాట్లాడుతారా ముఖ్యమంత్రి గారూ అంటూ ప్రశ్నించారు. మరోవైపు మహిళ హోం మంత్రి పెంపకంలో తేడా వలనే రేప్ లు జరుగుతున్నాయంటూ మహిళల్ని అవమానపరుస్తున్నారని విమర్శించారు.
సీఎం జగన్ మహిళలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు: నారా లోకేష్
-