బార్బీ బొమ్మలా మారాలని రూ. 53 లక్షలు ఖర్చు చేసిన యువతి.. కానీ

-

అమ్మాయిలకు బొమ్మలంటే ఇష్టం ఉంటుంది.. అందులోనూ బార్బీ బొమ్మంటే మరీ పిచ్చి.. కానీ.. ఆ పిచ్చి ఏకంగా ఆ బొమ్మలా నేను మారాలి అనుకునే వరకూ వెళ్తే.. వెళ్తే ఏంటి వెళ్లింది కూడా.. ఆ బొమ్మమీద ఇష్టంతో తాను అదే బొమ్మ ఆకారంలోకి రావాలని లక్షలు ఖర్చు చేసింది.. చేసింది బానే ఉంది కానీ కరెక్టుగా అదే బొమ్మలా మారిందా..? అంటే అది మీరే చూడండి..

21 ఏళ్ల జెస్సికా… ఆన్‌లైన్‌లో జెస్సీ బన్నీ (jessy.bunny.official ) పేరుతో ఫేమస్ అయింది.. తనకు తాను హ్యూమన్ బార్బీలా కనిపించేందుకు రూ.53 లక్షలు ఖర్చు చేసింది. జర్మనీకి చెందిన జెస్సికా… మూడేళ్లుగా రకరకాల సర్జరీలు చేయించుకుంటూ వస్తుంది.. ఇప్పటికి తాను కోరుకున్న లుక్ కొంత వచ్చింది అంటోంది. మీకు అలా అనిపిస్తోందా? ఆమెను చూస్తే బార్బీలా ఉందంటంరా..?

జెస్సికా తీరు ఆమె తల్లిదండ్రులకు నచ్చలేదట. ఏమైంది నీకు… ఇలా తయారవుతున్నావు” అంటూ ఆమెను దూరం పెట్టారు. ఆమె ఫోన్ కాల్స్‌ రిసీవ్ చేసుకోవడం కూడా మానేశారట. తల్లిదండ్రులే కాదు… సోదరుడు, తాత, నాన్నమ్మ కూడా మాట్లాడట్లేదు. మొత్తానికి ఫ్యామిలీ అంతా వదిలేశారు.. ఆమెవైపు చూసేందుకు కూడా వాళ్లు ఇష్టపడట్లేదు. జెస్సికా ఉండేది పాశ్చాత్యదేశంలో అయినా.. వారి కుటుంబం సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఆడపిల్లలంటే అణిగిమణిగి ఉండాలి, సంప్రదాయ దుస్తులే వేసుకోవాలి అని వారు నమ్ముతారు. జెస్సికాది ఆ మెంటాలిటీ కాదు.. చిన్నప్పటి నుంచి ఈ రూల్స్, రెగ్యులేషన్స్ కు విసిగిపోయింది. తనకు ఇష్టమైన మోడ్రన్ డ్రస్సులు వేసుకుంటే.. అందులో ఎక్కడైనా స్కిన్ కనిపిస్తే.. అక్కడ వాళ్ల తల్లిదండ్రులు స్కార్ఫ్ ఇచ్చి కప్పుకోమనేవాళ్లట.. దాంతో జెస్సికాకు ఇంకా మండేది. ఇలాంటి కట్టుబాట్లకు విసిగి పోయి తన 17 ఏళ్ల వయసులో ఇంట్లోంచి బయటకు వచ్చేసిందట. జర్మనీ నుంచి.. ఆస్ట్రేలియా చేరుకుని అక్కడి నుంచి బార్బీలా మారే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

సర్జరీలలో భాగంగా జెస్సికా మూడుసార్లు వక్షోజాల సైజును పెంచుకుంది. ఓసారి ముక్కును మార్పించుకుంది. సీటు.. బూరలా ఉబ్బేందుకు… ఇంజెక్షన్లు చేయించుకుంది. పెదవులు ఉబ్బేందుకు లిప్ ఫిల్లర్లు చేయించుకుంది. ఇవన్నీ చేయించుకున్నాక… తాను బార్బీ డాల్‌ లాగే కనిపిస్తున్నానని జెస్సికా భావిస్తోంది. “ఎవరేమనుకుంటే నాకెందుకు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను” అంటోంది ఈ బార్బీ.

జెస్సికాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 89 వేల అనుసరిస్తున్నారు.. ఈమె తరచూ తన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. వాళ్లలో ఎక్కువ మంది జెస్సీకా ఆకారం చూసి పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యేవారట. దాంతో తనకు మనసుకు హాయిగా అనిపించేది. ఇప్పుడు ఇలా ఉంది గానీ.. ఒకప్పుడు జెస్సికా… సన్నగా, సాధారణంగానే ఉండేది. ఇప్పుడు ఆమెను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఆస్ట్రియాలో అతి పెద్ద సిలికాన్ వక్షోజాలు నావే. ఆ మాత్రం సరిపోదు. జర్మనీలోనే అతి పెద్ద పెదవులు నాకే ఉండాలని నేను కోరుకుంటున్నాను” అని జెస్సికా అంటోంది. దీన్ని పిచ్చి అంటారో, ఇంకేమంటారో మీకే తెలియాలి.. ఆమె తన శరీరాన్ని ఇలా మార్చేసుకుంటుంది.. అయితే ఇలా చేసుకోవడం వల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ గురించి చూద్దాం..

రక్తం ఎక్కువగా కోల్పోతారు. పదే పదే ఇచ్చే మత్తు ఇంజెక్షన్ల వల్ల గుండె, ఊపిరితిత్తులు ప్రమాదంలో పడతాయి. ఒక్కోసారి ఆ శరీర భాగంలో నరాలు, అవయవం డ్యామేజ్‌ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆపరేషన్‌ తర్వాత ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలూ ఎక్కువే అంటున్నారు నిపుణులు. స్తనాలకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న వారిలో 2 నుంచి 4 శాతం మంది ఇన్ఫెక్షన్లకు గురవుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version