కృష్ణా జలాల పంచాయితీ.. బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు ఏపీ సర్కార్ లేఖ

-

కృష్ణా జలాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరోసారి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు చంద్రబాబు సర్కార్ లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జిలాలు వినియోగించుకుంటున్నా కరువు ప్రభావిత ప్రాంతాల్లో కృష్ణా జలాలు వాడుకునే హక్కు తమకు ఉందని లేఖలో పేర్కొంది. కృష్ణా బేసిన్‌లో పాత ప్రాజెక్టుల కింద నీటి వినియోగానికి రక్షణ ఉందని ప్రత్యేకంగా మెన్షన్ చేసింది.

అయితే, దానిని సమీక్షించడం సరికాదని బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు సూచించింది. కృష్ణా జలాల విషయంలో బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేయాలని లేఖలో సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. ఈ నెల 20న ఏపీ ప్రభుత్వం తరఫున తమ వాదనలను వినిపిస్తామని వెల్లడించింది. కృష్ణా జిలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలను తెలపాలని ట్రిబ్యునల్ కోరిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు స్పందించినట్లు తెలుస్తోంది.కాగా, దీనిపై ట్రిబ్యునల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version