ఏపీ సర్కార్ కి హైకోర్ట్ లో మరో షాక్ తగిలింది. కాపులుప్పాడు కొండపై అతిధి గృహ నిర్మాణం పై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్ట్. కొండపై అతిధి గృహ నిర్మాణం చేపట్టవద్దని హై కోర్టులో అమరావతి జెఎసి నేత గద్దె తిరుపతిరావు పిటీషన్ దాఖలు చేసారు. పిటీషనర్ తరుపున ఉన్నం మరళీధర్ రావు వాదించారు. గ్రే హాండ్స్ కి ఇచ్చిన స్థలంలో అతిధి గృహం ఎలా నిర్మాస్తారని పిటీషన్ దాఖలు చేసారు.
గ్రే హాండ్స్ నక్సల్స్, టెర్రరిస్ట్ వ్యతిరేకదళం, రహస్య ఆపరేషన్ నిర్వహిస్తుంటుందని పేర్కొన్నారు. వారం రోజుల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. అతిధిగృహం నిర్మాణం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీ చేయాలని… ఆదేశాలు ఇచ్చింది. గెస్ట్ హౌస్ కు కేటాయించిన 30 ఎకరాలలో చెట్లు నరకవద్దని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది.