ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తాను నియమించే చాన్స్ ఉన్నట్లు సమాచారం. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు.
ఆయన స్థానంలో హరీష్‌కుమార్ గుప్తాను డీజీపీగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఆయన్ను ఆ పోస్టులో కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల టైంలో హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించగా.. కొన్నిరోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీజీపీగా సీఎం చంద్రబాబు నియమించారు. కాగా, 1991 బ్యాచ్‌కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ తొలి స్థానంలో ఉండగా.. హరీష్‌గుప్తా రెండో స్థానంలో ఉన్నారు.వీరిలో డీజీపీ పోస్టు ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.