టీడీపీ నాయకులు పిచ్చనాకొడుకులన్న ఏపీ స్పీకర్…!

-

ఎప్పుడూ ఏదోక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలిచే ఏపీ అసెంబ్లీ స్పీకర్, తమ్మినేని సీతారం మరోసారి అదే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. టీడీపీ నాయకులు పిచ్చనాకొడుకులు అంటూ ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నిమ్మగడ్డ రమేశ్‌పై ప్రజలు కోపంతో ఉన్నారని, కనిపిస్తే కొట్టేలా ఉన్నారని స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతూ ఆయన ఆరోపించారు.

ఎన్నికల కమిషన్‌ను తాము గౌరవిస్తామని, అయితే కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని కాదని స్పష్టం చేసారు. ఎన్నికల కమిషనర్‌ కుర్చీలో కాకుండా సీఎం కుర్చీలోనే కూర్చోమనండి ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు వంటి నీచాతినీచ రాజకీయ నాయకులు ఉన్నంత వరకు వ్యవస్థలకు పట్టిన భ్రష్టు వదలదని స్పీకర్ ఆరోపణలు చేసారు. టీడీపీ నాయకులు పిచ్చనాకొడుకులని ఆయన ఆరోపించారు.

చంద్రబాబువి నీచ రాజకీయాలని ఆయన మండిపడ్డారు. ఆయనకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. తప్పు చేసే రాజ్యాంగ వ్యవస్థలను ప్రజా ఉద్యమాల ద్వారా ఎండగట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలని స్పీకర్ అన్నారు. ఆయన స్పీకర్ స్థానంలో ఉండి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో కూడా ఆయన ఇదే విధంగా వ్యాఖ్యలు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version