దిల్లీ హైకోర్టుకు ఏపీ వాలంటీర్ల కేసు!

-

గ్రామ/ వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా ఒక్కొక్కరికి నెలకు రూ.200 చొప్పున మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్​పై విచారణను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించింది.

వాలంటీర్లకు నెలవారీగా ఇచ్చే రూ.5 వేల గౌరవవేతనంతోపాటు, విస్తృత సర్క్యులేషన్‌ ఉన్న వార్తాపత్రిక కొనుగోలు కోసం నెలకు రూ.200 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం 2022 జూన్‌లో జీవో విడుదల చేసింది. 1.45 లక్షల మంది గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులకు రూ.200 చొప్పున మంజూరు చేస్తూ 2022 డిసెంబర్‌లో మరో జీవో ఇచ్చింది. ఈ రెండు జీవోలను సవాలు చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో గత ఫిబ్రవరిలో పిటిషన్‌ వేసింది.

ఆ కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 10కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version